భార్య, పిల్ల‌ల‌ను హ‌త్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టాడు.. రెండు నెలల తర్వాత..

MP Man Kills Wife, Two Children, Buries Them at Home. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో దారుణం చోటు చేసుకుంది.

By Medi Samrat
Published on : 23 Jan 2023 8:45 PM IST

భార్య, పిల్ల‌ల‌ను హ‌త్య చేసి ఇంట్లో పూడ్చిపెట్టాడు.. రెండు నెలల తర్వాత..

మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో దారుణం చోటు చేసుకుంది. అమన్ అనే వ్యక్తి తన భార్య, 7 ఏళ్ల కుమారుడు, 4 ఏళ్ల కుమార్తెను హత్య చేసి మృతదేహాలను తన ఇంట్లో పూడ్చిపెట్టాడు. ఈ విషయాన్ని పోలీసు అధికారులు ధృవీకరించారు. హత్యలు జరిగిన దాదాపు రెండు నెలల తర్వాత ఆదివారం సాయంత్రం ఈ విషయం బయట పడింది. వాళ్లను చంపేశారనే అనుమానం రాకుండా ఆ వ్యక్తి ఇంట్లో గత రెండు నెలలుగా నివసిస్తూ వచ్చాడని అధికారులు తెలిపారు.

నిందితుడి బంధువులు కనిపించకుండా పోయారని కొందరికి అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తిని విచారించగా హత్య చేసినట్లు అంగీకరించాడు. వైద్యులు, ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో మృతదేహాలను బయటకు తీశామని రత్లాం పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ తివారీ విలేకరులకు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే గొడ్డలితో హత్య చేశానని నిందితుడు ఒప్పుకున్నాడు. విచారణ తర్వాత మరిన్ని వివరాలు బయటకు రానున్నాయి. మృతదేహాలను నిర్ధారించుకోవడానికి మేము DNA పరీక్షలు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. నిందితుడితో పాటు మృతదేహాలను పాతిపెట్టడంలో అతనికి సహకరించిన సహచరుడిని అరెస్టు చేసినట్లు అధికారి తెలిపారు.

Next Story