తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షిత ప్రదేశాలు.. లైంగిక వేధింపులకు గురైన బాలిక సూసైడ్‌ నోట్‌

‘Mother’s Womb, Grave Only Two Safe Places'.. Minor Girl Suicide Note. లైంగిక వేధింపులకు గురైన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడగా.. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తోంది.

By అంజి  Published on  20 Dec 2021 2:05 AM GMT
తల్లి గర్భం, సమాధి మాత్రమే సురక్షిత ప్రదేశాలు..  లైంగిక వేధింపులకు గురైన బాలిక సూసైడ్‌ నోట్‌

నేటి సమాజంలో మహిళలకు పూర్తిగా రక్షణ లేకుండా పోతోంది. పసి పిల్లల నుండి పండు ముసలివారి వరకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అదును చూసి కంటికి చిక్కిన వారిపై కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రతో రోజు ఎంతో మంది అత్యాచారాల బారిన పడుతున్నారు. తాజాగా అలాంటి లైంగిక వేధింపులకు గురైన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడగా.. ఆమె రాసిన సూసైడ్‌ నోట్‌ ఇప్పుడు అందరిని కంటతడి పెట్టిస్తోంది. మానసిక వేదనతో ఎవరికీ తన బాధను చెప్పుకోలేక తనువు చాలించింది ఆ బాలిక. చెన్నైలోని పూనమల్లి ప్రాంతంలో 11వ తరగతి చదువుతున్న విద్యార్థిని లైంగిక వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడింది.

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాధితురాలి ఇంట్లో లభించిన సూసైడ్ నోట్‌ల ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తను చనిపోయే ముందు లేఖలో ఇలా రాసింది. "తల్లి గర్భం, సమాధి మాత్రం సురక్షితమైన ప్రదేశాలు మాత్రమే" అని ఉద్వేగభరితంగా చెప్పింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తొమ్మిదో తరగతి వరకు చదువుతున్న ప్రైవేట్ పాఠశాల నుండి వేరే స్కూల్‌కు మారింది. ఆ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌ కొడుకు తన కూతురు వేధించాడం వల్లే స్కూలు మార్చామని తల్లిదండ్రులు తెలిపారు. ఈ కోణాన్ని కూడా పోలీసులు రుజువు చేస్తున్నట్లు చెబుతున్నారు.

చెన్నైలో ఇటీవల మహిళలపై నేరాలు దురదృష్టకరం. గత వారం తమిళ్ అండులోని కోయంబత్తూర్ జిల్లాలో మరో ఉన్నత పాఠశాల విద్యార్థి మృతదేహం పొదలు మధ్య కనుగొనబడింది. డిసెంబర్ 11న ఆమె కనిపించకుండా పోయింది. మరో సందర్భంలో కోయంబత్తూరులో ఒక బాలిక తన టీచర్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ ఆత్మహత్య చేసుకుంది. పిల్లలపై లైంగిక వేధింపులను నిరోధించే చట్టాల (పోక్సో) కింద ఉపాధ్యాయుడు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు.

Next Story
Share it