పండక్కి ఇంటికి రాని కొడుకు.. మనస్తాపంతో తల్లి ఆత్మహత్య
Mother suicide in SR nagar police station area. ఓ తల్లి దీపావళి పండక్కి కొడుకు, కోడలు ఇంటికి రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్
పండక్కి అందరి ఇళ్లు కళకళలాడుతుంటాయి. ఇక తల్లికి అయితే వేరే దగ్గర స్థిరపడ్డ కొడుకు, కోడలు వస్తారన్న ఆశ ఎంతగానో ఉంటుంది. అయితే ఓ తల్లి దీపావళి పండక్కి కొడుకు, కోడలు ఇంటికి రాలేదని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. . పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోడల్‌కాలనీలో దండ బుచ్చి బాబు, సుజాత (53)లు నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు దండ యోగకు ఈ ఏడాది ఆగస్టులో గుంటూరుకు చెందిన రాహిత్యశ్రీతో పెళ్లి జరిగింది.
ఆ తర్వాత ఇద్దరు ఉద్యోగం రిత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. దీపావళి పండక్కి ఇంటికి రావాలని కొడుకు, కోడలును తల్లి సుజాత కోరింది. సెలవు లేకపోవడంతో వారు రాలేదు. గంపెడాశతో ఎదురు చూసిన తల్లి సుజాత కొడుకు, కోడలు రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఈ నేపథ్యంలోనే గురువారం నాడు భర్త బుచ్చిబాబు పెంట్‌హౌస్‌లో నిద్రపోతుండగా.. భార్య సుజాత కింద అంతస్థులోని గదిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గదిలో వచ్చిన భర్త.. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని వెంటనే పోలీసులకు అందించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.