ఆరుగురు పిల్లల తండ్రితో పారిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. భర్త ఏం చేశాడంటే?

Mother of three elopes with lover father of six children Rajasthan. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య

By అంజి  Published on  11 Jan 2023 7:52 AM GMT
ఆరుగురు పిల్లల తండ్రితో పారిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. భర్త ఏం చేశాడంటే?

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఓ వ్యక్తి పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి పేరు భన్వర్‌లాల్ మేఘ్వాల్. అతను మటోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని బార్సింగో బాస్ గ్రామంలో నివసిస్తున్నాడు. ఈ ఘటన తర్వాత మృతుడి ఇంట్లో శోకసంద్రం నెలకొనగా, అతని పిల్లలు బోరున విలపిస్తున్నారు.

ఘటనా స్థలం నుంచి పోలీసులకు సూసైడ్ నోట్ కూడా లభించింది. ఇందులో తన భార్య, ఆమె ప్రియుడితో సహా ఐదుగురిపై పలు ఆరోపణలు చేశాడు. ఈ విషయంపై ఒసియన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూర్ మహ్మద్ మాట్లాడుతూ.. సుమారు 6-7 నెలల క్రితం మృతుడు భన్వర్‌లాల్ భార్య తన ముగ్గురు పిల్లలను వదిలి ఆరుగురు పిల్లలకు తండ్రి అయిన మోహనరామ్ అనే వ్యక్తితో కలిసి పారిపోయిందని తెలిపారు.

దీనిపై భన్వర్‌లాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. దీని తర్వాత, భన్వర్‌లాల్ భార్య కిష్ణ తన ప్రియుడితో కలిసి జీవించాలనే కోరికను స్వచ్ఛందంగా వ్యక్తం చేసింది. అప్పటి నుంచి భన్వర్‌లాల్ మానసిక బాధతో గడపడం మొదలుపెట్టాడు. ఆమె తన ఇంటిని కాపాడుకోవడానికి అత్తమామల సహాయం కూడా కోరింది. అయితే భన్వర్‌లాల్‌కు ఎవరూ సహాయం చేయలేదు. విచారణలో.. భన్వర్‌లాల్ భార్య రోజూ తన ప్రియుడితో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేదని పోలీసులకు తెలిసింది. దీంతో మానసికంగా కుంగిపోయిన భన్వర్‌లాల్ సోమవారం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వీకరించేందుకు బంధువులు నిరాకరించారు. ఐదుగురిని అరెస్ట్ చేసిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. అయితే పోలీసులు ఒప్పించడంతో మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు అంగీకరించారు. మృతుడు భన్వర్‌లాల్ భార్య కిష్ణ, ఆమె ప్రియుడు మోహనరామ్ వేర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీరియస్‌గా విచారణ జరుపుతున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నూర్ మహ్మద్ తెలిపారు.

Next Story