జీడిమెట్ల పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కొడుకులు వేట కొడవలితో గొంతు కోసి అతికిరాతకంగా హత్య చేయడమే కాకుండా తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. మేడ్చల్ జిల్లాలోని కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజుల రామారంలో నివాసం ఉంటున్న తేజస్విని రెడ్డి అనే మహిళ, తన భర్త, ఇద్దరు కుమారులు ఆశిష్ రెడ్డి(07), హర్షిత్ రెడ్డి(05)లతో కలిసి నివాసం ఉంటుంది.
ఏం జరిగిందో తెలియదు కానీ తల్లి తేజస్విని తన ఇద్దరు మగ పిల్లలను వేట కొడవలితో గొంతు కోసి హత్య చేసి అనంతరం తాను భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తం మడుగులో పడి ఉన్న ఇద్దరు చిన్నారులను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని ఘటనకు సంబంధించి కారణాలపై దర్యాప్తు కొనసాగించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.