ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయబోయిన కామాంధుడు.. కాపాడిన కోతులు

చాలాచోట్ల కోతుల వల్ల జనజీవనం కష్టతరంగా మారగా.. వాటి కారణంగా ఓ బాలికకు అవాంఛనీయ ఘటన తప్పింది

By Medi Samrat
Published on : 24 Sept 2024 10:55 AM IST

ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేయబోయిన కామాంధుడు.. కాపాడిన కోతులు

చాలాచోట్ల కోతుల వల్ల జనజీవనం కష్టతరంగా మారగా.. వాటి కారణంగా ఓ బాలికకు అవాంఛనీయ ఘటన తప్పింది. యూపీలోని బాగ్‌పత్‌లో ఓ యువకుడు బాలికపై అత్యాచారానికి యత్నించగా.. కోతుల గుంపు అక్కడికి చేరుకుంది. కోతులను చూసి భయపడిన యువకుడు బాలికను వదిలి పారిపోయాడు. కేసు నమోదు చేసినప్పటికీ.. నిందితుడి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారు.

సెప్టెంబర్ 19న ఆరేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటూ ఉంది. ఇంతలో ఓ గుర్తుతెలియని యువకుడు పాలు ఇస్తానని చెప్పి బాలికను మభ్యపెట్టి మొబైల్ టవర్ దగ్గరకు తీసుకెళ్లాడు. అక్క‌డ యువకుడు బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఇంతలో కోతుల గుంపు పోట్లాడుకుంటూ టవర్ దగ్గరకు చేరుకుంది. కోతులను చూసి భయపడిన యువకుడు బాలికను బెదిరించి పారిపోయాడు.

బాలిక ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. నిందితుడు బాలికను తన వెంట తీసుకెళుతుండగా కెమెరాలో రికార్డ్ అయ్యింది. బాధితురాలి కుటుంబీకులు నిందితుడిపై ఫిర్యాదు చేయ‌గా.. కేసు నమోదు చేసిన పోలీసులు అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు. నిందితుడు ఎవరన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శివదత్ తెలిపారు. అతడిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు.

Next Story