10 రోజుల క్రితం జైలు నుంచి విడుదల.. సూసైడ్ నోట్‌లో షాకింగ్ విషయాలు
Molestation accused commits suicide. మైనర్‌పై వేధింపులకు పాల్పడి మూడు నెలల పాటు జైలులో ఉన్న నిందితుడు బెయిల్‌పై
By Medi Samrat Published on 15 Dec 2021 6:57 AM GMTఅమరావతి : మైనర్‌పై వేధింపులకు పాల్పడి మూడు నెలల పాటు జైలులో ఉన్న నిందితుడు బెయిల్‌పై బయటకు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. నిందితుడు చనిపోతూ సూసైడ్ నోట్ కూడా వదిలిపెట్టాడు. ఆ నోట్ ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. సూసైడ్ నోట్‌లో డబ్బుల కోసం వేధింపులకు గురి చేశారని అతడు తెలిపాడు. ఈ కేసులో అందిన సమాచారం ప్రకారం మూడు నెలల క్రితం యువకుడు మైనర్‌పై అత్యాచారం చేసినందుకు పోక్సో కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో 10 రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. మహారాష్ట్ర అమరావతిలోని ధామన్‌గావ్ రైల్వే తహసీల్ దత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. మూడు నెలల క్రితం మైనర్‌పై వేధింపులకు పాల్పడినందుకు 25 ఏళ్ల యువకుడిపై కేసు నమోదైంది. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని దాదాపు మూడు నెలల పాటు జైల్లో ఉంచారు.
10 రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. చనిపోయే ముందు అతడు వదిలిపెట్టిన సూసైడ్ నోట్ ప్రకారం తనపై బూటకపు కేసు పెట్టారని ఆరోపించాడు. ఫిర్యాదుదారులు డబ్బు వసూలు చేయడానికి తనను హింసించారని సూసైడ్ నోట్ లో రాశారు. తాను ఎటువంటి తప్పు చేయకపోయినా కూడా తనపై ఆరోపణలు వచ్చాయని చెబుతూ ఆ యువకుడు సమీపంలోని బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం నుంచి యువకుడు ఇంటికి తిరిగిరాకపోవడంతో ఈ విషయం బయటపడింది. బావి పక్కనే అతడి చెప్పులు, సూసైడ్ నోట్ కనిపించింది. సూసైడ్ నోట్ లో పోక్సో కేసు గురించి యువకుడు తెలిపాడు. ఫిర్యాదు చేసిన మహిళ వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నా అని అందులో రాశాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.