మరో మోడల్ ఆత్మహత్య
Model found hanging at home in Kolkata's Kasba. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో మరో మోడల్ ప్రాణాలను తీసుకుంది.
By Medi Samrat
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో మరో మోడల్ ప్రాణాలను తీసుకుంది. 18 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుంది. మోడల్ ఆదివారం కస్బాలోని బేడియాదంగా ప్రాంతంలోని తన గదిలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి దాస్ తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఉరి వేసుకుని ఉండటం గమనించింది ఆమె అమ్మమ్మ. వెంటనే ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. ఆమెను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో లేరు. సరస్వతి దాస్ తన అమ్మమ్మతో కలిసి నిద్రపోతూ ఉంది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో సరస్వతి పక్కన లేకపోవడంతో అమ్మమ్మ మరో గదిలోకి వెళ్లింది. అక్కడ సరస్వతి దాస్ ఆత్మహత్యకు పాల్పడింది.
సరస్వతి తన తల్లి ఆరతి దాస్‌తో కలిసి గత 17 సంవత్సరాలుగా తన మామ వద్ద ఉంటోంది. ఆమె తన తండ్రికి దూరంగా ఉందన కుటుంబ సభ్యులు తెలిపారు. మాధ్యమిక్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యాక, ఆమె తన చదువును విడిచిపెట్టి, ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టింది. అలాగే మోడలింగ్ చేయడంలో నిమగ్నమై ఉంది. ఆమె ఇటీవలి కాలంలో డిప్రెషన్‌తో కొట్టుమిట్టాడుతోందని కోల్‌కతా పోలీసు అధికారి ఒకరు తెలిపారు. రాత్రి 1 గంటల వరకు ఆమె తన ప్రియుడితో మాట్లాడుతున్నట్లు పోలీసులు ఫోన్ రికార్డులను సేకరించారు. ఆదివారం ఎక్కడో కలవడంపై వాగ్వాదం జరిగిందని, ఆ తర్వాత ఆమె ఉరివేసుకుని ఉండవచ్చని పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ కనుగొనబడలేదు. మరణానికి గల కారణాలపై నిర్ధారణ కోసం పోలీసులు పోస్ట్ మార్టం నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు.