గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ కారు సాగర్‌ కూడి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బాబాయి సుందరరామిరెడ్డి కొడుకు మదన్‌మోహన్‌ రెడ్డి భార్య లావణ్య, కూతురు సుదీక్ష మృతి చెందారు. మదన్‌మోహన్‌రెడ్డి స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. సంక్రాంతి పండుగ వస్తుండటంతో మదన్‌మోహన్‌ రెడ్డి భార్య, కుమార్తెతో కలిసి షాపింగ్‌ కోసం విజయవాడ వెళ్లారు. తిరిగి వస్తుండగా అడిగొప్పల వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయే ప్రయత్నం చేసిన క్రమంలో కారు అదుపుతప్పింది. పక్కనే ఉన్న సాగర్‌ కుడి కాలువలోకి దూసుకెళ్లింది.

కారు నడుపుతున్న మదన్‌మోహన్‌ రెడ్డి ఎలాగోలా అతికష్టం బయటకు వచ్చాడు.. కానీ అతని భార్య, కుమార్తెను మాత్రం రక్షించలేకపోయారు. అప్పటికే కాలువలో నీటి ప్రవాహా ఉద్ధృతి బాగా ఉంటడంతో కారు కొట్టుకుపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సాగర్‌ కాలువలో కారు పడిందని అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. బుగ్గవాగు రిజర్వాయర్‌ దగ్గర నీటిని కిందకు వెళ్లకుండా ఆపేశారు. అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో భారీ క్రేన్‌ సహాయంతో కారును కాలువ నుండి బయటకు తీశారు. కారులో ఉన్న లావణ్య, చిన్నారి సుదీక్షల మృతదేహాలు వెలికితీశారు. ఇద్దరు మృతి చెందడంతో పిన్నెళ్లి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story