4 సంవత్సరాల తర్వాత.. నైనిటాల్ అడవుల్లో తప్పిపోయిన వ్యక్తి అస్థిపంజరం లభ్యం

Missing person’s skeleton found in Nainital forests after 4 years. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీ ప్రాంతంలోని తాండా అడవుల్లో ఆదివారం నాడు 42 ఏళ్ల వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది.

By అంజి  Published on  13 Dec 2021 3:45 PM GMT
4 సంవత్సరాల తర్వాత.. నైనిటాల్ అడవుల్లో తప్పిపోయిన వ్యక్తి అస్థిపంజరం లభ్యం

ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లా హల్ద్వానీ ప్రాంతంలోని తాండా అడవుల్లో ఆదివారం నాడు 42 ఏళ్ల వ్యక్తి అస్థిపంజరం లభ్యమైంది. నాలుగేళ్ల క్రితం బాగేశ్వర్ జిల్లా నుంచి నైనిటాల్‌లోని తన సోదరిని కలవడానికి వచ్చిన వ్యక్తి కనిపించకుండా పోయాడని అధికారులు తెలిపారు. "ఆదివారం అటవీ ప్రాంతంలో దొరికిన అస్థిపంజరం దగ్గర ఆధార్ కార్డు, క్యాంటీన్ కార్డ్ దొరికాయి. ఈ రెండు కార్డులు అతన్ని గుర్తించాయి. మేము అతని బంధువులను సంప్రదించాము. వారు వచ్చి అంత్యక్రియల కోసం అస్థిపంజరాన్ని తీసుకెళ్లారు. అయినప్పటికీ ఎటువంటి సందేహం లేకుండా గుర్తింపును నిర్ధారించడానికి ఫోరెన్సిక్ బృందం మరణించిన అతడి నమూనాను డీఎన్‌ఏ పరీక్ష కోసం సేకరించింది. "అని హల్ద్వానీలోని ట్రాన్స్‌పోర్ట్ నగర్ పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌ఛార్జ్ మనోజ్ కుమార్ చెప్పారు.

మృతుడు బాగేశ్వరానికి చెందిన హరీష్ చంద్ర జోషిగా గుర్తించారు. కార్డుపై పేర్కొన్న మొబైల్ నంబర్ ఆధారంగా పోలీసులు అతని బంధువులను సంప్రదించగా, మృతుడు నాలుగేళ్ల క్రితం నైనిటాల్ జిల్లాలోని లాల్కువాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిందుఖట్టా అనే గ్రామానికి వచ్చి అదృశ్యమయ్యాడని పోలీసులకు తెలిసింది. పిథోరఘర్ మరియు లాల్కువాన్ పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ రిపోర్టు నమోదైంది. "అతని బంధువుల చెప్పిన వివరాల ప్రకారం.. అతను పితోర్‌ఘర్‌లోని బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (BRO) ఉద్యోగి" అని కుమార్ చెప్పారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హల్ద్వానీలోని రాంపూర్ రోడ్డు ప్రాంతానికి చెందిన కొందరు మహిళలు తాండా అడవుల్లో ఓ వ్యక్తి అస్థిపంజరాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

Next Story
Share it