దొంగలందరూ కలిసి ఓ జట్టుగా ఏర్పడి.. ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లు అయ్యారు
Miscreants cheated, police also surprised. అధికారులుగా నటిస్తూ డబ్బున్న వారి ఇళ్లల్లో రైడ్లను నిర్వహించే ఫేక్ అధికారులకు
By M.S.R Published on 1 Feb 2022 8:27 AM GMTఅధికారులుగా నటిస్తూ డబ్బున్న వారి ఇళ్లల్లో రైడ్లను నిర్వహించే ఫేక్ అధికారులకు సంబంధించిన సినిమా సీన్లు ఎన్నో ఉన్నాయి. హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకూ అలాంటి ఘటనలకు సంబంధించిన సీన్లు చాలానే ఉన్నాయి. ఇలాంటివి ఫాలో అవుతున్న వాళ్లు కూడా ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో దొంగలందరూ కలిసి ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్లుగా మారి రైడ్ నిర్వహించారు.
బీహార్‌లోని లఖిసరాయ్ ప్రాంతంలో ఈ నకిలీ దాడి చోటు చేసుకుంది. ఆదాయపన్ను శాఖ అధికారులుగా నటిస్తూ స్థానిక ఇసుక కాంట్రాక్టర్ ఇంటికి వచ్చిన ఏడుగురు దొంగలు రూ.25 లక్షలు డబ్బు, లక్షల రూపాయల విలువైన ఆభరణాలతో పరారయ్యారు. ఈ ఘటన కబయ్యా పోలీస్ స్టేషన్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ వీధిలో చోటు చేసుకుంది. విచారణ నిమిత్తం ఇసుక కాంట్రాక్టర్ సంజయ్ కుమార్ సింగ్ ఇంటికి వచ్చారు. అదే సమయంలో కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చే సమయానికి మొత్తం దోచేశారు. ఈ ఘటన మొత్తం ఇంట్లో అమర్చిన సీసీటీవీలో రికార్డయింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి నిందితులను గుర్తిస్తున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఐదుగురు పురుషులు, ఇద్దరు మహిళలు స్కార్పియో కారులో ఇసుక కాంట్రాక్టర్ సంజయ్ కుమార్ సింగ్ ఇంటికి చేరుకున్నారు. రాగానే ఇంట్లో ఆయుధాలు ఉన్నాయని చెప్పి వెతకడం ప్రారంభించారు. రూ.25 లక్షల నగదు, లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లి, అల్మారా తాళాలు తీసుకుని వెళ్లిపోయారు. ఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారు నంబర్ ఆధారంగా తదుపరి విచారణ జరుపుతున్నారు.