చెరకు తోటలో వివస్త్రగా బాలిక మృతదేహం.. చుట్టుపక్కల బీరు బాటిళ్లు, సిగరెట్లు

Minor's body found naked. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్‌లో షాకింగ్ కేసు చోటుచేసుకుంది. బర్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని

By Medi Samrat  Published on  15 Nov 2021 10:58 AM IST
చెరకు తోటలో వివస్త్రగా బాలిక మృతదేహం.. చుట్టుపక్కల బీరు బాటిళ్లు, సిగరెట్లు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిత్‌లో షాకింగ్ కేసు చోటుచేసుకుంది. బర్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం దగ్గర చెరకు తోటలో మైనర్ బాలిక మృతదేహం నగ్నంగా పడి ఉంది. విద్యార్థిని నోటిలో గుడ్డ బిగించి, మెడలో చున్నీ ఉండడాన్ని గుర్తించారు. ఒక రోజు వరకూ బాలిక ఇంటికి రాకపోవడంతో తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆమె మృతదేహం లభ్యం కావడంతో బాధితురాలి తండ్రి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఘ‌ట‌న‌పై సామూహిక అత్యాచారం, హత్య కేసులను పోలీసులు నమోదు చేశారు. దర్యాప్తు కూడా ప్రారంభించారు.

సాయంత్రం వరకు ఇంటికి తిరిగి రాకపోవడం గురించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మాయి బర్ఖెడా ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందినది. సాయంత్రం వరకూ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత అర్థరాత్రి గ్రామానికి 500 మీటర్ల దూరంలోని చెరుకు తోటలో అమ్మాయి మృతదేహం వివస్త్రగా కనిపించింది. అదే సమయంలో ఘటనా స్థలంలో ఆమె సైకిల్, బూట్లు, పుస్తకాలు లభ్యమయ్యాయి. పాప మృతదేహం దగ్గర 4 బీరు సీసాలు, సిగరెట్లు పడి ఉన్నాయి. మాజీ మంత్రి హేమ్‌రాజ్‌ వర్మ సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.


Next Story