పుస్తకం కోసం క్లాస్‌మేట్‌ ఇంటికి వెళ్తే.. మైనర్‌ బాలికపై అత్యాచారం, ఐదు నెలల గర్భవతి

Minor nabbed for raping, impregnating classmate in Tamil Nadu. తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుస్తకం కోసం ఇంటికి వచ్చిన తోటి విద్యార్థినిపై 16 ఏళ్ల బాలుడు దారుణానికి తెగబడ్డాడు.

By అంజి  Published on  13 Dec 2021 11:10 AM GMT
పుస్తకం కోసం క్లాస్‌మేట్‌ ఇంటికి వెళ్తే..  మైనర్‌ బాలికపై అత్యాచారం, ఐదు నెలల గర్భవతి

తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పుస్తకం కోసం ఇంటికి వచ్చిన తోటి విద్యార్థినిపై 16 ఏళ్ల బాలుడు దారుణానికి తెగబడ్డాడు. కోయంబత్తూరుకు చెందిన 16 ఏళ్ల బాలుడు మైనర్‌ బాలికపై అత్యాచారం చేయడంతో.. బాలిక గర్భం దాల్చింది. దీంతో బాలుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన క్లాస్‌మేట్‌ను గర్భం దాల్చినందుకు 11వ తరగతి బాలుడిని తుడియాలూరుకు చెందిన మహిళా పోలీసుల బృందం పట్టుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. "గత ఐదేళ్లుగా బాలిక, బాలుడు స్నేహితులుగా ఉంటూ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నారు. తరచూ ఒకరి ఇళ్లకు ఒకరు వెళ్లేవారు. జులై 25న ఆ అమ్మాయి పుస్తకం కోసం అబ్బాయి ఇంటికి వెళ్లింది.

ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న అతడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు'' అని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఆగస్ట్‌లో కూడా అబ్బాయి తన ఇంటికి వచ్చినప్పుడు అమ్మాయిని అనేక సందర్భాల్లో అత్యాచారం చేశాడని అధికారి చెప్పారు. "అమ్మాయి తరచుగా వాంతులు చేయడం ప్రారంభించినప్పుడు, ఆమె తల్లి ఆమెను శనివారం ఈఎస్‌ఐ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వైద్యులు 16 ఏళ్ల బాలికకు పరీక్షలు చేశారు. ఆమె గర్భవతిగా ఐదు నెలలు అని వైద్యులు గుర్తించారు. దీంతో బాలిక తుడియాలూరు మహిళా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో ఆదివారం బాలుడిని పట్టుకున్నారు.

Next Story
Share it