కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లా బాళే హెన్నూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడిని కలిసేందుకు ఇంటికి వచ్చిన మైనర్‌ బాలికపై.. ప్రియుడి తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడి అరెస్ట్ చేశామని బాలెహోన్నూరు పోలీసులు చెప్పారు. నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశామని పోలీసుల చెప్పారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బాలే హెన్నూరు పరిధిలో ఇద్దరు మైనర్లు గత కొంత కాలంగా ప్రేమ వ్యవహారం సాగిస్తున్నారు. కొద్ది రోజులుగా మైనర్‌ బాలిక ఇంటికి వెళ్తు వస్తున్నాడు మైనర్‌ బాలుడు. ఈ క్రమంలోనే ప్రియుడిని కలిసేందుకు మైనర్‌ బాలిక అతడి ఇంటికి వెళ్లింది.

ఇంట్లో తన కొడుకు లేడని, బయటి వెళ్లాడని, ఇప్పుడే వస్తాడని ప్రియుడి తండ్రి బాలికకు చెప్పాడు. కాసేపు ఇంట్లోనే ఉండమని కోరాడు. అప్పటికే సాయంత్రం అవుతోంది. ఇదే అదనుగా భావించిన ప్రియుడి తండ్రి మైనర్‌ బాలికపై కన్నేశాడు. బలవంతంగా లోబర్చుకుని లైంగిక దాడి చేశాడు. ఘటన అనంతరం బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిర్భయ లాంటి ఎన్ని కఠిన చట్టాలు తీసుకువచ్చిన బాలికలు, మహిళలపై అఘాయిత్యాలు మాగ్రం ఆగడం లేదు.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story