దారుణం : మైన‌ర్ బాలికపై 6 నెలలకు పైగా అత్యాచారం

Minor girl raped for over six months, 7 accused named in FIR. హరియాణాలోని భివానీ జిల్లాలో పాశవిక ఘటన వెలుగు చూసింది.16 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు.. 6 నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డారు

By Medi Samrat  Published on  12 March 2021 5:02 AM GMT
Minor girl raped for over six months

హరియాణాలోని భివానీ జిల్లాలో పాశవిక ఘటన వెలుగు చూసింది. 16 ఏళ్ల బాలికపై ఏడుగురు వ్యక్తులు.. 6 నెలలకు పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు బాలిక గర్భం దాల్చగా రేప్ విషయం బయటపడింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు బాలిక వెళ్లగా.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తొలుత ఆమెపై కొద్ది మంది లైంగికదాడికి పాల్పడ్డారని, అనంతరం మిగతావారూ ఆమెను వేధిస్తూ వచ్చారని చెప్పారు. అత్యాచార విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను బెదిరించారని తెలిపారు. నిందితుల్లో ఓ తండ్రీ, కుమారుడు కూడా ఉన్నారని పేర్కొన్నారు.

బాలిక గర్భం దాల్చి ఎన్ని నెలలు అవుతుందో తెలుసుకోవడానికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు చెప్పారు. నిందితుల్లో ఇద్దరు వ్యక్తులకు 50 ఏళ్ల వయస్సు ఉంటుందని.. మరో ఇద్దరికి 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉంటుందని తెలిపారు. త్వరలోనే వారందరినీ పట్టుకుంటామని పేర్కొన్నారు.
Next Story
Share it