దారుణం.. ఇంటి ముందు ఆడుకుంటున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గగహ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూసింది.
By Medi Samrat
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని గగహ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగు చూసింది. గ్రామంలోని నివాస ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలికి పొరుగున నివసించే నిందితుడు.. బాలికను టెర్రస్‌పైకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకుని నిందితుడిను అదుపులోకి తీసుకున్నారు.
తొమ్మిదేళ్ల బాలిక.. ఇంటి పొరుగున ఉంటున్న నిందితుడి ఇంటి ముందు ఆడుకుంటోందని కుటుంబ సభ్యులు తెలిపారు. బాలికను చూసిన నిందితుడు ఆమెను తన రెండంతస్తుల డాబాపైకి లాక్కెళ్లి మెట్ల దగ్గర దారుణానికి ఒడిగట్టాడు. ఘటన అనంతరం బాలిక ఏడుస్తూ ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసింది.
బాధితురాలి తండ్రి గగహ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి సుశీల్ కుమార్, ఏరియా అధికారి దర్వేష్ కుమార్ వెంటనే సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు.
నిందితుడి అన్నయ్య కూడా 2015లో ఓ వేధింపుల కేసులో జైలుకు వెళ్లాడని విచారణలో వెల్లడైంది. అతని తండ్రి స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలోని ఆలయ పూజారి. దీంతో ఈ కేసు మరింత సంచలనం సృష్టించింది. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామంలోని ప్రజలు రోడ్లపైకి వచ్చి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ క్రైం సుధీర్ జైస్వాల్ తెలిపారు. నిందితుడిని శిక్షించేందుకు ఆధారాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు.