హైద్రాబాద్ : నాచారం పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ లో దారుణం చోటుచేసుకుంది. కాకతీయ వైన్స్ పర్మిట్ రూమ్ లో తలెత్తిన చిన్నపాటి వివాదం.. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. అయితే.. శివ కుమార్ అనే వ్యక్తిపై మరో వ్యక్తి ధర్మేందర్ వేడి నూనె పోయడంతో తీవ్ర గాయాలయ్యాయి. నిన్న సాయంత్రం 9 గంటల సమయంలో ఈ గొడవ జరిగింది. తీవ్ర గాయాలపాలైన శివ కుమార్ ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దాడికి దిగిన వ్యక్తి ధర్మేందర్ ని నాచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వ్యక్తి ఓ బీజేపీ నాయకుడి దగ్గర డ్రైవర్ గా ఉన్నట్లు సమాచారం.