నెల్లూరులో మెడికో ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా?
నెల్లూరు జిల్లాలో మెడిక ఆత్మహత్య కలకలం రేపింది. నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో చైతన్య (23) ప్రాణాలు తీసుకుంది.
By అంజి Published on 2 July 2023 12:02 PM ISTనెల్లూరులో మెడికో ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమా?
నెల్లూరు జిల్లాలో మెడిక ఆత్మహత్య కలకలం రేపింది. నారాయణ మెడికల్ కాలేజీలో మెడికో చైతన్య (23) ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన వైద్య విద్యార్థిని చైతన్య (23).. చింతారెడ్డిపాలెం దగ్గర ఉన్న నారాయణ మెడికల్ కాలేజీ హాస్టల్‌లో ఉంటూ హౌస్ సర్జన్‌గా పని చేస్తోంది. ఆదివారం నాడు కాలేజీ హాస్టల్ రూమ్‌లో చైతన్య శవమై కనిపించింది. ఇది చూసిన తోటి రూమ్‌మేట్స్ హాస్టల్ సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
అనంతరం చైతన్య ఫ్యామిలీకి సమాచారం అందించారు. 3 నెలల కిందటే చైతన్యకు పెళ్లి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే చైతన్య ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. చైతన్యకు ఆమె భర్తతో ఏమైనా గొడవ జరిగిందా? లేక కాలేజీలో ఎవరైనా వేధించారా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు చైతన్య ఆత్మహత్య మేనమామ శ్రీరామ్ కీలక ఆరోపణలు చేశారు. ఆమె ఆత్మహత్యకు కారణం ఆమె భర్త వేధింపులేనని చెబుతున్నారు. చైతన్య చిన్నప్పుడే తండ్రి ఆర్మీలో మరణించాడు.
అప్పటి నుండి ఆమె అమ్మమ్మ, తల్లి పెంపకంలో పెరిగింది. ఎంతో కష్టపడి చదువుకుంటూ ఈ స్థాయికి చేరుకుంది. ఈ సంవత్సరం మార్చి 8న చైతన్యకు పెళ్లిచేశామని, అడిగినంత కట్నకానుకలు ఇచ్చామని, పెళ్లి తర్వాత భర్త నిజస్వరూపం బయటపడిందని చైతన్య మేనమామ తెలిపారు. భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని తెలిసి చైతన్య పలుమార్లు భర్తను ప్రశ్నించిందని అప్పటి నుండి వరకట్న వేధింపులకు గురైనట్లు మేనమామ శ్రీరామ్ తెలిపారు. తన జీవితమే నాశనం అయిందంటూ చైతన్య పలుమార్లు తన తల్లికి ఫోన్ చేసి మొరపెట్టుకునేదని, గతరాత్రి కూడా తల్లితో మాట్లాడిందన్నారు.