కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

కరీంనగర్‌లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు డ‌కు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు.

By Medi Samrat  Published on  2 Feb 2025 10:12 AM IST
కరీంనగర్ లో విషాదం.. వైద్య విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

కరీంనగర్‌లో పీజీ వైద్య విద్యార్థిని ఆర్తి సాహు ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఈ నిర్ణయం తీసుకోడానికి కారణం ఇంకా తెలియరాలేదు. ప్రతిమ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పీజీ రెండో సంవత్సరం చదువుతున్న ఆర్తి జనవరి 30న పురుగుల మందు తాగింది. ఇతర విద్యార్థులు ఆమెను చికిత్స నిమిత్తం కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా శనివారం రాత్రి తుదిశ్వాస విడిచింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో వైద్య విద్యార్థి వేదింపుల వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆర్తీ సాహు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ నాంపల్లి అబిడ్స్ ప్రాంతానికి చెందిన రాజేంద్ర సాహు కూతురు ఆర్తీ సాహు ప్రతిమ మెడికల్ కళాశాలలో పీజీ సెకండియర్ పల్మనాలజి చదువుతోంది.

Next Story