అచ్యుతాపురం సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

Massive fire at Achyutapuram Sahithi Pharma. అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది.

By Medi Samrat  Published on  30 Jun 2023 2:21 PM IST
అచ్యుతాపురం సాహితీ ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి

అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లా కేంద్రంలోని అచ్యుతాపురం సెజ్‌లోని సాహితీ ఫార్మాలో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు చెల‌రేగాయి. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు జరగడంతో విధుల్లో ఉన్న కార్మికులు తీవ్ర భయాందోళనల‌కు గురై అక్కడ నుంచి పరుగులు తీశారు. రియాక్టర్‌ పేలడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు మృతిచెందినట్లు తెలుస్తోంది.

ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంట‌నే మూడు ఫైరింజన్లతో ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్ర‌యత్నిస్తున్నారు. పేలుడు ధాటికి పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. చుట్టుపక్కల పరిశ్రమలకు మంటలు అంటుకుంటాయని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలావుంటే.. గత జనవరిలో కూడా లాలంకోడూరు సమీపంలోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.



Next Story