వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

Married woman ends life over in-laws harrasment. అత్తమామల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన

By Medi Samrat  Published on  5 Jun 2022 8:00 PM IST
వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

అత్తమామల వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయనగరంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని మయూరి జంక్షన్‌కు చెందిన నిర్మల (27)కి స్థానిక బాలాజీ రోడ్డులోని నటరాజ్ కాలనీకి చెందిన భార్గవ్‌తో 2020లో వివాహం జరిగింది.

ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు కాగా.. ప్ర‌స్తుతం వీరు వ‌ర్క్ ప్ర‌మ్ హోం చేస్తున్నారు. అయితే.. పెళ్లయినప్పటి నుంచి భర్త భార్గవ్, అతని కుటుంబ సభ్యులు నిర్మలను అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె పలుమార్లు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అయితే ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో నిర్మలని తల్లిదండ్రులు తిరిగి అత్తింటికి పంపించారు.

ఈ నేప‌థ్యంలోనే నిర్మల నిన్న‌ ఇంట్లో ఫ్యాన్‌కు మెడ‌కు ఉరితో క‌నిపించింది. నిర్మల ఆత్మహత్య చేసుకుందా లేక అత్తమామలు హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి తండ్రి లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సబ్ ఇన్‌స్పెక్టర్ దుర్గాప్రసాద్ తెలిపారు.












Next Story