అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Married woman dies in mysterious circumstances in Nellore district. ఓ వివాహిత ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన

By Medi Samrat  Published on  22 May 2022 8:19 AM GMT
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

ఓ వివాహిత ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రామచంద్రాపురంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలాజీనగర్‌ సంపూర్ణ (28)కు అదే ప్రాంతానికి చెందిన టీ మాస్టర్‌ వేణుతో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కుటుంబం రామచంద్రాపురంలో అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. వీరికి కుమార్తెలు సంజన, జయశ్రీ ఉండగా.. ఒక‌రు పొదలకూరు రోడ్డులోని ఓ పెట్రోల్ బంక్‌లో సేల్స్ గర్ల్స్‌గా ప‌నిచేస్తున్నారు. ఇదిలాఉంటే.. వేణు.. సంపూర్ణతో మూడేళ్ల క్రితం విడిపోయాడు.

అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఈ సమయంలో ఆమెకు వైఎస్ఆర్ నగర్‌కు చెందిన ఓ ఆటోడ్రైవర్‌తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఆటోడ్రైవర్ ఆమె ఇంటికి వచ్చాడు, శనివారం తెల్లవారుజామున మహిళ నిద్ర లేవలేదు. దీంతో కుమార్తెలు పెద్దమ్మ జయమ్మకు సమాచారం అందించడంతో ఆమె ఇంటికి చేరుకుని నగరంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి మెడపై స్వల్ప గాయమైంది. ఈ క్రమంలో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
Share it