ఓయో రూమ్‌లో గొడవ.. ప్రియురాలిని కాల్చి చంపిన వివాహితుడు.. ఆ తర్వాత

Married man shoots girlfriend in Delhi Oyo after argument, tries to kill self. ప్రియురాలితో కలిసి ఓ వివాహితుడు ఓయో హోటల్‌కు వెళ్లాడు. రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో

By అంజి  Published on  23 Nov 2022 3:11 PM IST
ఓయో రూమ్‌లో గొడవ.. ప్రియురాలిని కాల్చి చంపిన వివాహితుడు.. ఆ తర్వాత

ప్రియురాలితో కలిసి ఓ వివాహితుడు ఓయో హోటల్‌కు వెళ్లాడు. రూమ్‌లో ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో వివాహితుడు తన ప్రియురాలిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని నరేలాల జరిగింది. ఓయో గదిలో గొడవ తర్వాత 38 ఏళ్ల వివాహితుడు తన ప్రియురాలిని కాల్చిచంపాడు. ఆ తర్వాత ప్రవీణ్ అలియాస్ సితు అనే నిందితుడు తన తలపై కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అయితే అతను ప్రాణాలతో బయటపడి సంజయ్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఈ విషయంపై ప్రాథమిక విచారణలో నిందితుడు, 39 ఏళ్ల బాధితురాలు గీత మంగళవారం హోటల్ గదిలోకి ప్రవేశించినట్లు తేలింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని, ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహంతో తన ప్రియురాలి ఛాతీపై కాల్చాడని హోటల్ సిబ్బంది మీడియాకు తెలిపారు. ఆమెను చంపిన తర్వాత తానూ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిందితుడిపై సెప్టెంబర్ 21న మరో హత్య కేసు నమోదైంది. అయితే ఆ తర్వాత బెయిల్ మంజూరైంది. గౌరవ్ అనే వ్యక్తిని కాల్చి చంపాడు. అతనిపై బాధితుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో జైలుకు పంపబడ్డాడు.

కాల్పుల తర్వాత.. ఈ సంఘటన తీవ్ర భయాందోళనలకు దారితీసింది. పోలీసు అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గీతను ఆసుపత్రికి తరలించగా వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ప్రవీణ్‌కు సుశీల అనే భార్య, పిల్లలతో కలిసి గ్రామంలో ఉంటోంది.

Next Story