ఏపీలో రెచ్చిపోయిన మావోలు..

Maoists Attack Bus In Andhra Pradesh. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు.

By Medi Samrat  Published on  25 April 2022 5:45 AM GMT
ఏపీలో రెచ్చిపోయిన మావోలు..

అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పరివెల, కొత్తూరు గ్రామాల మధ్య చింతూరుకు 10కి.మీ దూరంలో నేషనల్ హైవే రోడ్డుపై రాత్రి 10 గంటల సమయంలో బస్సుకు నిప్పంటించి కాల్చేశారు మావోయిస్టులు. ముందు బస్సు ఆపి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను దిగమని హెచ్చరించగా.. దిగకపోయేసరికి ప్రయాణికులతో ఉన్న బస్సుకు నిప్పంటించారు. దీంతో అరుస్తూ ప్రయాణికులు బ‌స్సు దిగారు.

బ‌స్సులో ఉన్న ఇద్దరు ప్రయాణికులకు తలబాగంలో మంటలు అంటుకోగా.. ప్రయాణికుల సామాగ్రి మాత్రం పూర్తిగా కాలిపోయింది. ఘ‌ట‌న జ‌రిగిన స‌మ‌యంలో బస్సులో దాదాపు 50మంది ప్రయాణికులు ఉన్న‌ట్టు స‌మాయారం. ఈ ఘటనలో ప్ర‌త్య‌క్షంగా ఐదుగురు వోయిస్టుల పాల్గోన్నారని.. ఓ 10 మంది వ‌ర‌కూ చెట్ల మాటున దాగి ఉన్నార‌ని ప్రయాణికులు చెబుతున్నారు. స‌మాచారం అంద‌డంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు.

Next Story
Share it