రోడ్డు పక్కన లగ్జరీ కారులో.. రక్తసిక్తమైన యువకుడి మృతదేహం.. గొంతుకోసి ఆ తర్వాత

Man's bloodied body found in luxury car in Madhya Pradesh. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 25 ఏళ్ల సంజు (కబీర్) కోరి

By అంజి  Published on  27 Jan 2022 8:11 PM IST
రోడ్డు పక్కన లగ్జరీ కారులో.. రక్తసిక్తమైన యువకుడి మృతదేహం.. గొంతుకోసి ఆ తర్వాత

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లా నుండి ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 25 ఏళ్ల సంజు (కబీర్) కోరి అలియాస్ కరియా అనే యువకుడి రక్తసిక్తమైన మృతదేహం సివిల్ లైన్ కింద గతేవారా గ్రామం సమీపంలోని నాలుగు లైన్‌లో లగ్జరీ కారులో లభ్యమైంది. ఛతర్‌పూర్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ ఏరియా ఈ ఘటన జరిగింది. అయితే ఇది ప్రాథమికంగా హత్యగా కనిపిస్తుంది. వివరాల ప్రకారం.. సంజు జనవరి 26 సాయంత్రం ఇంటి నుండి బయలుదేరాడు. ఆ తర్వాత రాత్రి వరకు అతను రాలేదు.

ఇవాళ ఉదయం 6:00 గంటల సమయంలో.. ఇక్కడ నాలుగు లైన్ల రోడ్డులోని ఒక విలాసవంతమైన కారులో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉందని హైవే పెట్రోలింగ్ వ్యక్తులు.. సివిల్ లైన్ పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై సివిల్‌లైన్‌ టీఐ పుష్పేంద్ర మిశ్రా, పోలీసు బలగాలతో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహానికి పంచనామా సిద్ధం చేసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. కారులో రక్తసిక్తమైన మృతదేహం లభ్యమైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ వ్యక్తి గొంతు కోసి ఉంది. ప్రాథమికంగా చూస్తే కేసు హత్యగా తెలుస్తోంది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత స్పష్టత వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Next Story