బ్రేకింగ్: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య

Mancherial municipal commissioner’s wife found hanging. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ భార్య జ్యోతి మంగళవారం ఆదిత్య ఎన్‌క్లేవ్ కాలనీ

By Medi Samrat  Published on  7 Feb 2023 5:41 PM IST
బ్రేకింగ్: మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ భార్య జ్యోతి మంగళవారం ఆదిత్య ఎన్‌క్లేవ్ కాలనీలోని తమ నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలను తీసుకుంది. జ్యోతి తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంగళవారం నాడు ఆమె ఆదిత్య ఎన్ క్లేవ్ కాలనీలోని తన నివాసంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. డెడ్ బాడీని పోస్టు మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఆమె ఉరివేసుకుని చనిపోయారని మంచిర్యాల అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బి తిరుపతి రెడ్డి తెలిపారు. మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణం మేదరివాడలోని ఆదిత్య ఎన్ క్లేవ్ లో మున్సిపల్ కమీషనర్ బాలకృష్ణ భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. విషయం తెలుసుకున్న మంచిర్యాల ఏసిపి తిరుపతి రెడ్డి, సిఐ నారాయణ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన బాలకృష్ణ గతంలో పోలీసు శాఖలో పని చేశారు. ఆ తర్వాత సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి నిర్మల్ మున్సిపల్ కమిషనర్ గా తొలి పోస్టింగ్ పొందారు. పదోన్నతిపై గ్రేడ్ వన్ కమిషనర్ గా మంచిర్యాలకు వచ్చారు. బాలకృష్ణ జ్యోతి దంపతులకు కొడుకు, కూతురు ఉన్నారు. విషయం తెలుసుకున్న జ్యోతి తల్లిదండ్రులు, బంధువులు ఖమ్మం జిల్లా నుండి బయలుదేరారు.


Next Story