దళిత మహిళను పెళ్లి చేసుకున్నాడు.. ఊర్లో అడుగుపెట్టగానే..
Man Who Married Dalit Woman. 21వ దశాబ్దంలో కూడా మనుషుల్లో కొంచెం కూడా మార్పు రావడం లేదు. 28 సంవత్సరాల వయసు ఉన్న
By Medi Samrat Published on 13 Nov 2020 9:31 AM GMTగురుగ్రామ్: 21వ దశాబ్దంలో కూడా మనుషుల్లో కొంచెం కూడా మార్పు రావడం లేదు. 28 సంవత్సరాల వయసు ఉన్న ఓ వ్యక్తిని కొందరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్లు కొట్టారు. లాఠీలను తీసుకుని ఆ వ్యక్తి మీద ఆదివారం నాడు దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు తుదిశ్వాస విడిచాడు.
బాధితుడైన ఆకాష్ సోదరుడు మాట్లాడుతూ.. కొన్ని నెలల కిందట తన సోదరుడు దళిత మహిళను పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుండి బెదిరింపులను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఆదివారం నాడు ఆకాష్ తన భార్యతో కలిసి.. ఆమె తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళాడు. ఆ సమయంలో కొందరు వ్యక్తులు ఉన్నట్లుండి దాడి చేశారు. గురుగ్రామ్ కు దగ్గరగా ఉన్న బాద్షాపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హత్య అభియోగాలపై మొత్తం 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆకాష్ ఆటో రిక్షాలో వస్తూ అజయ్ అనే వ్యక్తి అతడిని చూశాడు. వెంటనే ఆటోరిక్షాను ఆపి.. ఆకాష్ తో గొడవకు దిగాడు. అజయ్ తన స్నేహితులను పిలిపించి ఆకాష్ మీద కర్రలతో దాడి చేయించాడు. ఆ తర్వాత అజయ్ అక్కడి నుండి జారుకున్నాడని పోలీసులు తెలిపారు. అజయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని గురువారం నాడు కోర్టులో హాజరు పరిచారు. ఆకాష్ దళిత మహిళను పెళ్లి చేసుకున్నాడని అజయ్ కు, అజయ్ స్నేహితులకు తెలుసునని పోలీసులు తెలిపారు. ఆకాష్ దళిత మహిళను పెళ్లి చేసుకోవడం వారికి ఇష్టం లేదని.. ఇంటర్-క్యాస్ట్ పెళ్లి చేసుకున్నందుకు ఆకాష్ ను గతంలో కూడా బెదిరించారట. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఊర్లో అడుగుపెడితే ప్రాణాలతో వెళ్లనిచ్చేది లేదని ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చారని ఆకాష్ సోదరుడు తెలిపాడు.