కస్టడీలో ఉన్న యువకుడికి బలవంతంగా మూత్రం తాగించి.. చిత్ర హింసలకు గురి చేసిన పోలీసులు

Man tortured, made to drink urine in police custody in Bengaluru. వారు నన్ను కనీసం 30 సార్లు క్రికెట్ బ్యాట్‌తో కొట్టారు. నేను త్రాగడానికి నీరు అడిగినప్పుడు, వారు నన్ను మూత్రం తాగించారు. నా గడ్డం కూడా కోశారు.

By అంజి  Published on  7 Dec 2021 9:22 AM GMT
కస్టడీలో ఉన్న యువకుడికి బలవంతంగా మూత్రం తాగించి.. చిత్ర హింసలకు గురి చేసిన పోలీసులు

బెంగళూరులో పోలీసుల కస్టడీలో ఓ వ్యక్తి చిత్రహింసలకు గురయ్యాడు. తౌసిఫ్, అక్బర్ అనే ఇద్దరు వ్యక్తుల మధ్య వ్యక్తిగత గొడవ జరిగిన తరువాత డిసెంబర్ 1 న ఈ సంఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి తౌసిఫ్‌ను పీఎస్‌కు తీసుకెళ్లారు. బాధితుడిని పోలీసు కస్టడీలో 3 గంటలకు పైగా చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. ఈ ఘటన బెంగళూరులోని బయటరాయణపుర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

బాధితుడి వాంగ్మూలం ప్రకారం.. క్రైమ్ టీమ్‌లోని ఒకరితో సహా హరీష్, మరో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు తన కడుపుపై ​​బ్యాట్‌తో కొట్టారని, బలవంతంగా గడ్డం కోసి, మూత్రం తాగించారని తౌసిఫ్ చెప్పారు. "వారు నన్ను కనీసం 30 సార్లు క్రికెట్ బ్యాట్‌తో కొట్టారు. నేను త్రాగడానికి నీరు అడిగినప్పుడు, వారు నన్ను మూత్రం తాగించారు. నా గడ్డం కూడా కోశారు. ఇది నా విశ్వాసంలో భాగమైనందున అలా చేయవద్దని నేను వారిని వేడుకున్నాను. అయితే ఇది (పోలీస్ స్టేషన్) మతపరమైన కేంద్రం కాదని వారు చెప్పారు. నన్ను పోలీస్ స్టేషన్‌ను కూడా శుభ్రం చేసేలా చేశారు" అని ఆయన అన్నారు. అతని ప్రైవేట్ పార్ట్ కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ఆరోపణలపై ప్రాథమిక విచారణలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడి మతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేశారన్నారు.

ఈ నేపథ్యంలోనే పోలీస్ స్టేషన్‌లో 23 ఏళ్ల ముస్లిం యువకుడిపై దాడి చేసి, బలవంతంగా మూత్రం తాగించినందుకు పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌ను బెంగళూరు నగర పోలీసులు సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ హరీష్ కెఎన్ బైటరాయణపుర పోలీస్ స్టేషన్‌కు అటాచ్ చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బెంగుళూరు వెస్ట్ జోన్ డీసీపీకి నివేదిక సమర్పించేందుకు ఏసీపీ స్థాయి అధికారిని నియమించారు. డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ (వెస్ట్) సంజీవ్ ఎం పాటిల్ మాట్లాడుతూ.. హరీష్‌ విధుల్లో నిర్లక్ష్యం చేయడం, పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేయనందుకు సస్పెండ్ చేసినట్లు తెలిపారు. బాధిత కుటుంబీకుల ఆరోపణలపై శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశించారు.

తౌసిఫ్ తండ్రి అస్లాం పాషా మాట్లాడుతూ.. తన కుమారుడిపై దాడి జరిగిందని అన్నారు. తౌసిఫ్ విడుదల కోసం పోలీసులు డబ్బులు డిమాండ్ చేశారు. "కానీ తౌసిఫ్ పోలీసు స్టేషన్ నుండి బయటకు వచ్చే వరకు క్రూరమైన హింసకు గురయ్యాడని మాకు తెలియదు" అని తండ్రి చెప్పారు. ఎమ్మెల్యే బిజెడ్ జమీర్ అహ్మద్ ఖాన్ జోక్యంతో తౌసిఫ్‌ను విడుదల చేసినట్లు అస్లాం తెలిపారు. తౌసిఫ్‌ను విక్టోరియా ఆస్పత్రిలో చేర్చి సోమవారం డిశ్చార్జి చేసినట్లు బాధిత కుటుంబీకులు తెలిపారు. వారు అతని శరీరంపై అయినా గాయాల చిత్రాలను కూడా చూపించారు.

Next Story