తల్లిని దారుణంగా హ‌త్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు

Man surrenders after slitting mother’s throat. గోవింద్ కాటేకర్ అనే 28 ఏళ్ల వ్యక్తి పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోయాడు. ఇంతకూ అతడు చేసిన నేరమేమిటంటే.

By M.S.R  Published on  30 Jan 2023 7:59 PM IST
తల్లిని దారుణంగా హ‌త్య చేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు

గోవింద్ కాటేకర్ అనే 28 ఏళ్ల వ్యక్తి పోలీసుల ఎదుట వచ్చి లొంగిపోయాడు. ఇంతకూ అతడు చేసిన నేరమేమిటంటే.. తన తల్లిని చంపేయడమే..! ఆదివారం నాడు నాగపూర్ లోని వందేవి మాతా నగర్‌లో తన తల్లి విమ్లాదేవిని హత్య చేసి యశోధర నగర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆస్తి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా కేటేకర్ తన తల్లి గొంతు కోసి హత్య చేసినట్లు తెలిసింది.

కాటేకర్ తన తల్లిని చంపిన తర్వాత ఐదు గంటలపాటు ఎక్కడెక్కడో తిరిగి.. చివరికి పోలీసులను ఆశ్రయించాడు. తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. మద్యానికి బానిసైన కేటేకర్ కూలీగా పనిచేస్తూ ఉండేవాడు. అతడు మద్యం కొనేందుకు డబ్బుల కోసం తల్లిని తరచూ వేధించేవాడు. కాటేకర్ గొడవలతో విసిగిపోయిన అతని అన్నయ్య తన కుటుంబంతో కలిసి వేరే చోటికి మారాడు. తమ ఆస్తిని విక్రయించి తనకు వాటా ఇవ్వాలని కాటేకర్ తన తల్లిపై ఒత్తిడి తెచ్చేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయమై గత మూడు రోజులుగా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. కాటేకర్ తన తల్లిపై దాడి చేయడానికి పదునైన కత్తిని ఉపయోగించాడని పోలీసులు తెలిపారు. యశోధర నగర్ పోలీసులు కాటేకర్‌ను అరెస్టు చేశారు.


Next Story