మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దొంగతనం చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని బట్టలు తొలగించి, కాలుతున్న కర్రతో కొట్టారు. ఫిబ్రవరి 4న ఈ ఘటన జరిగింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలోని విజయ్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్‌పురా గ్రామంలో అరవింద్ కలావత్ అనే యువకుడు మొబైల్ ఫోన్ దొంగిలించాడని హెట్రామ్, గోలు అనే ఇద్దరు వ్యక్తులు ఆరోపించారు. అరవింద్‌ను తమ ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి బట్టలు తొలగించి వేధింపులకు గురి చేశారు.
ఆ తర్వాత వారు కాలుతున్న కర్రతో అరవింద్‌ను కొట్టారు. సంఘటన యొక్క వీడియోను కూడా చిత్రీకరించారు. ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సంఘటన గురించి తెలిసిన తర్వాత.. పోలీసులు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో స్వచ్ఛందంగా గాయపరచడం), 323 (స్వచ్ఛందంగా గాయపరిచినందుకు శిక్ష), ఎస్టీ, ఎస్టీ (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు) చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు హెట్రామ్‌ను అరెస్టు చేశారు. అతని సహచరుడు గోలు ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.