అన్నను చంపిందన్న అనుమానం.. వదిన గొంతును టవల్‌తో బిగించి హత్య చేసిన మరిది

Man strangulates woman to death in Tamil Nadu. ఓ మహిళ తన సోదరుడిని హత్య చేసిందనే అనుమానంతో.. ఆమెను దారుణంగా హతమార్చిన 19 ఏళ్ల యువకుడు, అతని స్నేహితుడిని పోలీసులు

By అంజి  Published on  6 Jan 2022 8:42 AM GMT
అన్నను చంపిందన్న అనుమానం.. వదిన గొంతును టవల్‌తో బిగించి హత్య చేసిన మరిది

ఓ మహిళ తన సోదరుడిని హత్య చేసిందనే అనుమానంతో.. ఆమెను దారుణంగా హతమార్చిన 19 ఏళ్ల యువకుడు, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని కార్తీక్‌గా గుర్తించారు. ఈ సంఘటన తమిళనాడులోని తిరుపోరూర్‌లోని కామరాజర్ నగర్‌లో జరిగింది. బాధితురాలు, షాహిన్షా (26) ఆమె ఇంట్లో శవమై కనిపించింది. ఆమె మరణం తర్వాత, ఆమె మరిది, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కార్తీక్, అతని స్నేహితుడు మద్యం మత్తులో బాధితురాలిని టవల్‌తో హత్య చేసి తప్పించుకున్నారు. ఆ మహిళ తల్లి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను గుర్తించి కెలబాక్కం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షాహిన్షా విజయ్‌ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అయితే దురదృష్టవశాత్తు, అతను వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత మరణించాడు. అతను ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పొరుగువారికి చెప్పింది. కానీ ఆమె తన సోదరుడిని హత్య చేసిందని కార్తీక్ అనుమానించాడు. మిస్టరీని వెలికితీసే ప్రయత్నంలో అతను తన సోదరుడి మరణం యొక్క వివరాలను సేకరించేందుకు బాధితురాలితో సంబంధాన్ని ఏర్పరచుకున్నాడు. కానీ ఆ మహిళ తన సమాధానాలతో అస్పష్టంగా ఉంది. కేలబక్కంకు వెళ్లాలని నిర్ణయించుకుంది. కార్తీక్ తో మాట్లాడటం మానేసింది. ఈ సంఘటన గురించి కార్తీక్‌ను వేధిస్తూ ఉంటే తన సోదరుడిలానే తాను కూడా ఎదుర్కొంటానని షాహిన్షా హెచ్చరించినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత బాధితురాలిని కార్తీక్‌ తన స్నేహితుడితో కలిసి హత్య చేశాడని, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Next Story
Share it