అప్పులతో ఇబ్బందులు పడుతున్నా.. అందుకే దొంగత‌నం.. ఆరు నెలల్లో ఇచ్చేస్తా..

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని ఒక దుకాణం నుండి రూ.2.45 లక్షలు దొంగిలించిన వ్యక్తి తాను చేసిన పనికి క్షమాపణ కోరుతూ ఒక లేఖను రాసి పెట్టాడు.

By Medi Samrat
Published on : 7 April 2025 8:17 PM IST

అప్పులతో ఇబ్బందులు పడుతున్నా.. అందుకే దొంగత‌నం.. ఆరు నెలల్లో ఇచ్చేస్తా..

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని ఒక దుకాణం నుండి రూ.2.45 లక్షలు దొంగిలించిన వ్యక్తి తాను చేసిన పనికి క్షమాపణ కోరుతూ ఒక లేఖను రాసి పెట్టాడు. అప్పులతో ఇబ్బందులు పడుతున్నాడని, రుణదాతల నిరంతర వేధింపుల కారణంగానే ఈ పని చేస్తున్నట్లు తెలిపారు. ఆరు నెలల్లో ఆ మొత్తాన్ని తిరిగి ఇస్తానని కూడా మాట ఇచ్చాడని సోమవారం ఒక పోలీసు అధికారి తెలిపారు.

కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని జమీదార్ మొహల్లాలోని జుజర్ అలీ బోహ్రా దుకాణంలో ఆదివారం- సోమవారం మధ్య రాత్రి దొంగతనం జరిగిందని కొత్వాలి పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్ అర్షద్ ఖాన్ తెలిపారు. దొంగ దుకాణ యజమానిని జుజార్ భాయ్ అని సంబోధిస్తూ టైప్ చేసిన లేఖను వదిలివేసాడు. దుకాణ యజమాని తన వద్ద ఒక బ్యాగులో రూ. 2.84 లక్షలు ఉంచుకున్నారని, అందులో దాదాపు రూ. 2.45 లక్షలు దొంగిలించగా, రూ. 38,000 అలాగే ఉంచేశాడు.

Next Story