జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి హ‌త్య‌

Man stabs wife with screwdriver in Jahangirpuri. జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే భార్యను పొట్టనపెట్టుకున్నాడు ఓ భర్త.

By Medi Samrat
Published on : 8 Jan 2023 5:21 PM IST

జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి హ‌త్య‌

జైలు నుంచి విడుదలైన రెండు రోజులకే భార్యను పొట్టనపెట్టుకున్నాడు ఓ భర్త. దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలో ఈ దారుణం చోటు చేసుకుంది. తన భార్యను స్క్రూడ్రైవర్‌తో పొడిచి చంపిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. నిందితుడిని నార్త్ వెస్ట్ ఢిల్లీలోని జహంగీర్‌పురికి చెందిన చేత్రామ్‌గా గుర్తించారు. పోలీసులు అతన్ని గతంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సిఆర్‌పిసి) సెక్షన్ 107 మరియు 151 కింద జైలుకు పంపారని చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతంలో అరెస్టు చేసినందుకు భార్య కూడా ఓ కారణమని అతడు భావించాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఛేత్రమ్ తన భార్యను స్క్రూడ్రైవర్‌తో పలుమార్లు పొడిచాడు, ఈ ఘటనలో అతని ముక్కుకు కూడా గాయమైంది. ఈ ఘటనపై ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story