ప్రాణం తీసిన భార్య మాజీ లవర్

22-Yr-old man stabbed to death by his wife's ex-lover. గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో 22 ఏళ్ల యువకుడిని అతని భార్య మాజీ ప్రియుడు హత్య చేశాడు.

By M.S.R  Published on  6 March 2023 6:48 PM IST
ప్రాణం తీసిన భార్య మాజీ లవర్

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో 22 ఏళ్ల యువకుడిని అతని భార్య మాజీ ప్రియుడు హత్య చేశాడు. బాధితుడిని కిషన్ దోడియాగా గుర్తించారు. మాలవీయనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు హిరేన్ పర్మార్.. కిషన్ దోడియాను పలుమార్లు కత్తితో పొడిచాడు. బాధితుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. బాధితుడి భార్య రాధిక.. పర్మార్, అతని సహచరుడు కంచపై ఫిర్యాదు చేసింది. రాధికా నాలుగు సంవత్సరాల క్రితం దోడియాను వివాహం చేసుకుంది. తన మాజీ ప్రియుడిని దూరంగా ఉంచిందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది.

పర్మార్ రాధికా వైవాహిక జీవితంలో జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు. నిందితుడు భర్తను విడిచిపెట్టి అతని వద్దకు తిరిగి రావాలని కూడా రాధికాను బలవంతం చేశాడని రాధిక పోలీసులకు తెలిపింది. నాలుగు నెలల క్రితం కూడా పర్మార్ ఆమెను ఇబ్బందులకు గురిచేశాడు. రాధిక ఫిర్యాదు మేరకు నిందితుడితో పాటు అతని సహాయకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. పలు కోణాల్లో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు.


Next Story