దారుణం.. భార్యను చంపి, ముక్కలు చేసి నీళ్ల ట్యాంకులో దాచాడు

ఛత్తీస్‌ఘడ్‌లో ఓ వ్యక్తి తన భార్యను చంపి, శవాన్ని ముక్కలు చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By అంజి  Published on  6 March 2023 9:00 AM GMT
Chhattisgarh, water tank, Crime news

దారుణం.. భార్యను చంపి, ముక్కలు చేసి నీళ్ల ట్యాంకులో దాచాడు

ఛత్తీస్‌ఘడ్‌లో శ్రద్ధా వాకర్‌ హత్య ఘటన తరహా మరో ఘటన వెలుగు చూసింది. ఇక్కడ ఓ వ్యక్తి తన భార్యను చంపి, శవాన్ని ముక్కలు చేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్ ఠాకుర్ తన భార్య సతీ సాహును చంపేశారు. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి బిలాస్‌పూర్‌లోని ఉస్లాపూర్‌లోని తన ఇంట్లోని వాటర్ ట్యాంక్‌లో పడేశాడు. తరువాత శవాన్ని ముక్కలు చేసి, ఇంట్లోని నీళ్ల ట్యాంకులో వేశారు. తన భార్య మరొకరితో లైంగిక సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను పవన్ ఠాకుర్ చంపినట్లు పోలీసులు వెల్లడించారు. సుమారు ఒకటి రెండు నెలల కిందట ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు

పోలీసుల వివరాల ప్రకారం.. తఖత్‌పూర్ గ్రామానికి చెందిన పవన్ సింగ్ ఠాకూర్ వేరే కులానికి చెందిన సతీ సాహును వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం దంపతులు ఉస్లాపూర్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. భార్యపై ఠాకూర్ తరచూ అనుమానంతో వ్యక్తం చేసేశాడు. దీంతో భార్యభర్తలు తరచూ గొడవలు పడేవారు. అయితే కొన్ని రోజుల నుంచి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో ఇరుగుపొరుగు వారు గమనించి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఠాకూర్‌ను విచారించి.. అతని సమక్షంలో అద్దె ఇంట్లో సోదాలు చేశారు.

ఇంటి పైకప్పు నుంచి దుర్వాసన వస్తుండడాన్ని గమనించిన పోలీసులు, వాటర్ ట్యాంక్‌లో పడేసిన ప్లాస్టిక్ సంచిలో బాధితురాలి కుళ్లిపోయిన అవశేషాలను గుర్తించారు. ఫోరెన్సిక్ నిపుణులను పిలిపించి సమగ్ర విచారణ జరిపి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

తాజా సంఘటన శ్రద్ధా వాకర్, నిక్కీ యాదవ్ హత్యలతో సారూప్యతను కలిగి ఉంది. నిక్కీ యాదవ్ కేసులో నిందితుడు సాహిల్ గెహ్లాట్ ఆమెను హత్య చేసి మృతదేహాన్ని తన కుటుంబానికి చెందిన దాబాలోని రిఫ్రిజిరేటర్‌లో పెట్టి అదే రోజు మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. శ్రద్ధా వాకర్ కేసులో.. నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావల్ల తన లివ్-ఇన్ భాగస్వామిని చంపి, ఆమె శరీరాన్ని అనేక ముక్కలుగా నరికాడు. అతను వాటిని 300-లీటర్ల రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసి మూడు నెలల వ్యవధిలో ఢిల్లీలోని ఛతర్‌పూర్ అటవీ ప్రాంతంలో పారవేశాడు.

Next Story