మెదక్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున రామాయంపేట మండలం గ్రామ శివారులో రక్తపు మడుగులో నందు అనే 25 ఏళ్ల యువకుడు కనిపించడంతో డి. ధర్మారంలో భయాందోళనలు నెలకొన్నాయి. నందు అనే యువకుడిని రెండు కళ్లలో కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపినట్లు సమాచారం. నందు సన్నిహితుల్లో ఒకరు రాత్రికి రాత్రే ఈ దారుణానికి పాల్పడ్డారని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామాయంపేట పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.