హైదరాబాద్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనంలోని తమ ఫ్లాట్‌లో 22 ఏళ్ల బుద్ధిమాంద్యం ఉన్న వ్యక్తి తన తల్లి మృతదేహంతో మూడు రోజులు గడిపాడు. ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తోందని ఇరుగుపొరుగు వారు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహాన్ని గుర్తించారు.
విజయ (50) మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తరలించిన పోలీసులు.. ఆమె కుమారుడిని విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. యువకుడే తల్లిని హత్య చేసి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు. వారి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెబుతున్నారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.