దారుణం : నిద్రిస్తున్న బావమరిది పిల్ల‌ల‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు..

Man sets brother-in-law's children on fire in Pataudi. ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు కాలిన గాయాలకు గురయ్యారు. 28 ఏళ్ల వ్యక్తి తన భార్య ఇంట్లోకి

By M.S.R  Published on  3 Nov 2021 7:35 AM GMT
దారుణం : నిద్రిస్తున్న బావమరిది పిల్ల‌ల‌పై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు..

ఇద్దరు మైనర్‌లతో సహా నలుగురు కాలిన గాయాలకు గురయ్యారు. 28 ఏళ్ల వ్యక్తి తన భార్య ఇంట్లోకి చొరబడి తన బావమరిది మైనర్ పిల్లలను, ఆ పిల్లల తాత, అవ్వలపై పెట్రోల్ పోసి నిప్పట్టించడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం పటౌడీలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిని వివిధ ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించామని, ఒకరిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. రోహ్‌తక్‌లోని బోహర్ గ్రామానికి చెందిన రింకూ అనే నిందితుడికి కూడా కాలిన గాయాలయ్యాయి. ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేరినట్లు పోలీసులు తెలిపారు.

రింకూ, అతని భార్య ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారని.. వివాదాల కారణంగా కొంతకాలంగా విడిగా ఉంటున్నారని పోలీసులు తెలిపారు. వరకట్నం, గృహహింస కింద ఆమె రింకుపై కోర్టులో కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. పటౌడీలోని రాంపూరా క్రాసింగ్‌లో రింకూ తన భార్య అమ్మానాన్నలు ఉంటున్న ఇంటి వద్దకు మధ్యాహ్నం 2 గంటల సమయంలో అతడు వెళ్ళాడు. పెట్రోలు డబ్బాతో ఇంట్లోకి చొరబడ్డాడని పోలీసులు తెలిపారు. ఇంట్లో సోఫాలో నిద్రిస్తున్న తన బావ మరిది పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు.

నిందితుడి చొక్కాకు కూడా మంటలు వ్యాపించాయి.. దీంతో అతడికి కాలిన గాయాలయ్యాయి. పాత్రలు కడుగుతున్న పిల్లల తల్లి తన పిల్లలను రక్షించేందుకు పరుగెత్తడంతో ఆమెకు కూడా స్వల్పంగా కాలిన గాయాలయ్యాయి. నిందితుడు స్పృహలో లేడని.. చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు. నలుగురిని పటౌడీలోని సివిల్ ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం ఇతర ఆసుపత్రులకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు మైనర్ పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. కోర్టు కేసులో తన భార్యకు ఆమె సోదరుడు మద్దతుగా ఉన్నందున అతనిపై కక్ష పెంచుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ సభ్యుల వాంగ్మూలం ఇంకా నమోదు కావాల్సి ఉంది. స్టేట్‌మెంట్‌ వచ్చిన తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.


Next Story
Share it