అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచ‌ల‌న తీర్పు

2020లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి హైదరాబాద్‌లోని నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది

By Medi Samrat  Published on  30 Oct 2024 9:15 PM IST
అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు సంచ‌ల‌న తీర్పు

2020లో బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి హైదరాబాద్‌లోని నాంపల్లిలోని మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్టు జీవిత ఖైదుతోపాటు రూ. 5,000 జరిమానా విధిస్తూ సంచ‌ల‌న తీర్పు వెల్ల‌డించింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసులో నిజామాబాద్‌కు చెందిన బొగ్గుల సాయిలు (54) అనే నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. భారత శిక్షాస్మృతిలోని 376(2) (3) (ఎన్) (పదహారేళ్లలోపు మహిళపై అత్యాచారం), 506 (నేరపూరిత బెదిరింపు) కింద బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. నాంపల్లి సెషన్స్ కోర్టులో ఏడ‌వ‌ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి అనిత తీర్పు వెలువ‌రించారు.

మ‌రోకేసులో.. 2019లో హైదరాబాద్‌లోని మలక్‌పేట్‌లో 14 ఏళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన మణికుమార్ అనే వ్య‌క్తికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు ప్రత్యేక సెషన్స్ జడ్జి పుష్ప‌ల‌త తీర్పు వెలువ‌రించారు.

Next Story