13 ఏళ్ల బాలికపై అత్యాచారం.. ఆపై బ్లాక్ మెయిల్ చేసి..
Man rapes, blackmails teen to convert to Islam in Karnataka. కర్ణాటకలో 13 ఏళ్ల బాలికను బ్లాక్ మెయిల్ చేసి, ఇస్లాం మతంలోకి మారి పెళ్లి చేసుకోమని
By M.S.R Published on 23 Nov 2022 3:30 PM GMTకర్ణాటకలో 13 ఏళ్ల బాలికను బ్లాక్ మెయిల్ చేసి, ఇస్లాం మతంలోకి మారి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నందుకు ఓ వ్యక్తిపై కర్నాటకలో పోలీసులు మతమార్పిడి నిరోధక చట్టం, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద అభియోగాలు మోపారు. నిందితుడిని యూనస్ పాషా అలియాస్ ఫయాజ్ మహ్మద్ అనే వ్యక్తిగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు బాలికకు స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడని, వారిద్దరు వీడియో కాల్స్‌లో మాట్లాడటం మొదలుపెట్టారని తెలిపారు. బాలిక కుటుంబానికి ఫోన్ గురించి తెలియదని పోలీసులు వెల్లడించారు. ఒకరోజు, నిందితుడు వీడియో కాల్‌లో బాలిక అశ్లీల చిత్రాలను తీశాడు.. వాటిని ఉపయోగించి బెదిరిస్తూ శారీరక సంబంధం పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చారని పోలీసులు తెలిపారు. ఆమె అందుకు నిరాకరించడంతో, అతను ప్రైవేట్ చాట్‌లు, అసభ్యకరమైన ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులకు చూపిస్తానని బెదిరించడం ప్రారంభించాడు. యూనస్‌కు అప్పటికే పెళ్లయిందని, ఓ పాప కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఓ రోజు బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉండడంతో ఆమెకు నిద్ర మాత్రలు తినిపించి.. అత్యాచారం కూడా చేశాడని బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆరోపించారు. అమ్మాయిలో మార్పు కనిపించడంతో కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని బయటపెట్టింది.
8వ తరగతి చదువుతున్న తన 13 ఏళ్ల కుమార్తెను తమ ఇంటికి ఎదురుగా నివసించే వ్యక్తి బ్లాక్ మెయిల్ చేశాడని బాలిక తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఓ రోజు ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచార యత్నం చేశాడని, పెళ్లి చేసుకోవాలంటే బలవంతంగా మతం మార్చుకోవాలని బెదిరించాడని ఫిర్యాదులో తెలిపాడు. ఈ ఫిర్యాదును బట్టి మేము నిందితుడిని అరెస్టు చేసాము, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసామని తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మాండ్యా పోలీసు సూపరింటెండెంట్ ఎన్ యతీష్ మీడియాకు తెలిపారు.