ఢిల్లీలో అరాచకం.. వీధి కుక్కపై వ్యక్తి అత్యాచారం

దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని కించపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి మూగ జంతువుపై అత్యాచారం చేశాడు.

By అంజి  Published on  27 Feb 2023 3:30 AM GMT
Delhi news, National News, Stray dog, Crime news

ప్రతీకాత్మక చిత్రం

దేశ రాజధాని ఢిల్లీలో మానవత్వాన్ని కించపరిచే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ వ్యక్తి మూగ జంతువుపై అత్యాచారం చేశాడు. హరి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. సమాచారం ప్రకారం.. పీఎస్‌ పరిధిలో ఉన్న ఓ పార్కులో ఓ వ్యక్తి ఆడ కుక్కను తన కామానికి బలి చేశాడు. ఆ వ్యక్తి ఆడ కుక్కపై అత్యాచారం చేస్తుండగా, దాన్ని ఎవరో వీడియో తీశారు. అనంతరం ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు ఫిబ్రవరి 25న హరినగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు ఆదివారం అంటే ఫిబ్రవరి 26వ తేదీన సెక్షన్ 377/11, యానిమల్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ వీడియో ఎప్పటి నుంచి వచ్చిందో, మూగ జంతువును చిత్రహింసలకు గురిచేసిన వ్యక్తి ఎవరనేది ఆరా తీస్తున్నారు.

అంతకుముందు ఫిబ్రవరి 25 న, యానిమల్ యాంటీ క్రూయెల్టీ సెల్ ఆఫీసర్ తరుణ్ అగర్వాల్ దాని వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయలేదని రాశారు. ''అధికారంలో ఉన్న వ్యక్తుల బాధ్యత ఏమిటి? తమ అధికారాలను దుర్వినియోగం చేయకుండా ఉండటమే వారి బాధ్యత కాదా?'' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. హరినగర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి కుక్కతో చేసిన అకృత్యాలపై అత్యాచారం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ఆరోపించారు. మహిళలపై అత్యాచారాల కోసం ఢిల్లీ పోలీసులు ఎదురు చూస్తున్నారా? అంటూ ప్రశ్నించారు.

భారత జాతీయ కాంగ్రెస్‌కు చెందిన జాతీయ మీడియా ప్యానలిస్ట్ కూడా తరుణ్ ట్వీట్‌ను రీట్వీట్ చేసి.. "ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా రేపిస్ట్‌ను రక్షిస్తున్నారు" అని రాశారు. హరినగర్‌ ఎస్‌హెచ్‌వోపై చర్యలు తీసుకోకుండా అడ్డుకోవడం ఏమిటి? ఇది నేరం కాదా? అని నిలదీశారు. అయితే దీని తర్వాత హరినగర్ పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

గతంలో యూపీలోని ఘజియాబాద్ జిల్లా నుంచి కూడా ఇలాంటి కేసు ఒకటి తెరపైకి వచ్చింది. ఓ వ్యక్తి ఆడ కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే ఆ వ్యక్తి ఈ నీచమైన పని చేస్తుంటే అతడి కోడలు దాన్ని వీడియో తీసింది. మామ కళ్లు ఆమెపై పడడంతో.. అదే స్థితిలో కోడలుతో గొడవ పడుతూ నిందితుడు ఆమె మొబైల్ లాక్కున్నాడు. తరువాత కోడలు పీపుల్ ఫర్ యానిమల్ (PFA) అనే జంతు ప్రేమికులు, రక్షణ సంస్థతో సంబంధం ఉన్న బృందానికి క్రూరత్వం గురించి సమాచారం ఇస్తూ మొత్తం సంఘటనను వివరించింది. బాధితురాలి మాటలు విన్న పిఎఫ్‌ఎ బృందం వెంటనే చర్యలు తీసుకుంది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు 60 ఏళ్ల నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు నిందితుడు గతంలో కూడా ఇలాంటి కిరాతక చర్యలకు పాల్పడ్డారని స్థానికులు తెలిపారు.

Next Story