హత్య చేసి 12 ఏళ్ల పాటూ తప్పించుకుని తిరిగాడు.. చివరికి

భార్యను హత్య చేసి 12 ఏళ్లపాటు పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.

By Medi Samrat  Published on  24 Nov 2024 4:29 PM IST
హత్య చేసి 12 ఏళ్ల పాటూ తప్పించుకుని తిరిగాడు.. చివరికి

భార్యను హత్య చేసి 12 ఏళ్లపాటు పరారీలో ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడు వివిధ ప్రాంతాల్లో తలదాచుకుంటూ, స్థలాలను తరచూ మారుస్తూ అరెస్టుల నుండి తప్పించుకోగలిగాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.

12 సంవత్సరాలకు ముందు భార్యతో గొడవ పడిన సదరు వ్యక్తి భార్యకు నిప్పంటించాడని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నాడు. భార్యను హత్య చేసిన తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. భార్యాభర్తలిద్దరూ మద్యం సేవించేవారని, మద్యం మత్తులో ఈ హత్య జరిగిందని పోలీసులు తెలిపారు. తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తర్వాత నిందితుడు పరారీలో ఉండగా, వైద్యం చేయించినప్పటికీ మహిళ మృతి చెందింది.

పాత కేసుల సాధారణ సమీక్షలో, రాజ్‌నంద్‌గావ్‌లో నిందితుడు ఉన్నట్లు సమాచారం ఓ వ్యక్తి అందించాడు. సమాచారాన్ని ధృవీకరించడానికి పోలీసులు మారువేషాల్లో అతడి దగ్గరకు వెళ్లారు. హత్య చేసి తప్పించుకున్న వ్యక్తి అతడే అని ధృవీకరించుకున్నాక అరెస్టు చేశారు.

Next Story