ప్రియుడితో క‌లిసి భర్తను హత్య చేసిన భార్య‌

Man murdered by wife, paramour in Asifabad. అక్రమ సంబంధాన్ని అడ్డుకున్నందుకు భ‌ర్త‌నే క‌డ‌తేర్చింది ఓ ఇల్లాలు.

By Medi Samrat  Published on  2 Aug 2022 4:43 PM IST
ప్రియుడితో క‌లిసి భర్తను హత్య చేసిన భార్య‌

అక్రమ సంబంధాన్ని అడ్డుకున్నందుకు భ‌ర్త‌నే క‌డ‌తేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి) మండలం ఇటుకులపహాడ్ గ్రామంలో మంగళవారం జరిగింది. కౌటాల ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని బాలాగఢ్‌కు చెందిన రోజువారీ కూలీ మడావి దేవేందర్ (40)ని అతని భార్య పార్వతి, ప్రియుడు రాంలాల్ హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పార్వతి, రాంలాల్ వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు అభ్యంతరం వ్యక్తం చేసిన‌ దేవేందర్‌ను ఇరువురు క‌లిసి హతమార్చారు. మొదట అత‌నిపై పెద్ద కర్రతో దాడి చేయ‌గా.. అత‌ను అక్క‌డిక‌క్క‌డే కుప్ప‌కూలిపోయాడు.. ఆ త‌ర్వాత మృత‌దేహాన్ని అటవీ ప్రాంతంలో పాతిపెట్టారు.

పార్వతి, రామ్‌లాల్‌లు ఇంట్లో సన్నిహితంగా గడుపుతున్నప్పుడు దేవేందర్ వారిని గుర్తించాడు. వెంట‌నే భార్యతో గొడవ పడి కర్రతో కొట్టాడు. దీంతో పార్వతి.. రామ్‌లాల్‌ సహాయంతో దేవేందర్ పై దాడి చేసింది, దాడిలో దేవెంద‌ర్‌ మరణించాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు అతని మృతదేహాన్ని పాతిపెట్టారు. ఇటుకలపాడ్‌ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ నరేష్‌ ఫిర్యాదు మేరకు పార్వతి, రాంలాల్‌పై హత్య, చీటింగ్‌ కేసులు నమోదు చేశారు.


Next Story