ఆస్తి కోసం తండ్రిని హ‌త్య చేసిన కొడుకు

Man murdered by son at Begumpet. బేగంపేటలో శనివారం రాత్రి ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు

By Medi Samrat
Published on : 24 July 2022 3:42 PM IST

ఆస్తి కోసం తండ్రిని హ‌త్య చేసిన కొడుకు

బేగంపేటలో శనివారం రాత్రి ఆస్తి త‌గాదాల నేప‌థ్యంలో ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు అబ్రహం లింకన్ (75) గత కొన్నేళ్లుగా బేగంపేటలోని పత్తిగడ్డలో ఏ రెస్టారెంట్‌లో వంట మనిషిగా పనిచేస్తూ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. శనివారం రాత్రి రెండో భార్య కుమారుడు కిరణ్ (30) బేగంపేటలోని రెస్టారెంట్‌కు వెళ్లి ఆస్తి విషయంలో తండ్రితో వాగ్వాదానికి దిగాడు. ఈ క్ర‌మంలోనే కిరణ్ తన వెంట తీసుకెళ్లిన కత్తితో తండ్రి అబ్రహంను పొడిచి, అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన అబ్రహంని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బేగంపేట పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






Next Story