ఢిల్లీ మెట్రోలో మరోసారి పాడు పనులు

దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో కొందరు బరితెగించి ప్రవర్తించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

By Medi Samrat  Published on  31 Aug 2023 5:09 PM IST
ఢిల్లీ మెట్రోలో మరోసారి పాడు పనులు

దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో కొందరు బరితెగించి ప్రవర్తించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అధికారులు పలు సూచనలు చేశారు. తాజాగా ఓ కామాంధుడు హస్తప్రయోగం చేసి, మైనర్ బాలికపై స్ఖలనం చేసిన ఘటన ఢిల్లీ మెట్రోలో చోటుచేసుకుంది. ఢిల్లీ మెట్రో రైలులో బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో రెడ్ లైన్‌ మార్గంలో ప్రయాణిస్తున్న మైనర్ బాలికపై హస్తప్రయోగం చేసి స్కలనం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాఖీ పండుగ కావడంతో మెట్రో చాలా రద్దీ ఉందని, ఈ సమయంలో నిందితుడు నీచంగా వ్యవహరించాడు. కిక్కిరిసిన కోచ్‌లో ప్ర‌యాణిస్తున్న‌ వ్యక్తి.. తన కుమార్తెపై స్ఖలనం చేసిన విషయాన్ని మైనర్ బాలిక తల్లి చూసి, వెంటనే సీలంపూర్ మెట్రో స్టేషన్‌లో దిగిపోయారు. కోచ్‌లోని తోటి ప్రయాణికులు దీనిని గమనించి, నిందితుడ్ని పట్టుకుని మెట్రో అధికారులకు అప్పగించారు. నిందితుడ్ని పశ్చిమ బెంగాల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. నిందితుడ్ని ఢిల్లీ మెట్రో అధికారులు షాహదారా స్టేషన్‌లో అప్పగించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story