భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆపై తాను ఆత్మహత్యాయత్నం

Man kills wife, tries and fails to end own life in Maharashtra. జీవితాంతం కలిసి ఉంటానని మాటిచ్చిన భర్తే... ఆవేశంతో తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆపై తాను కూడా అనేకసార్లు ఆత్మహత్యకు

By అంజి  Published on  10 Jan 2022 2:17 AM GMT
భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త.. ఆపై తాను ఆత్మహత్యాయత్నం

జీవితాంతం కలిసి ఉంటానని మాటిచ్చిన భర్తే... ఆవేశంతో తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆపై తాను కూడా అనేకసార్లు ఆత్మహత్యకు ప్రయత్నించి.. విఫలమయ్యారు. ఈ సంఘటన మహారాష్ట్ర రాష్ట్రంలోని గోండ్‌ప్రిప్రి తహసీల్‌ భంగారం తలోధి గ్రామంలో జరిగింది. భర్త రాజు బవానే (42) అర్థరాత్రి భార్య యోగిత (35)తో గొడవ పడ్డాడు. కాసేపటికే అది తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజు భార్యను చంపాలని నిర్ణయించుకున్నాడు. గొడ్డలి పట్టుకుని యోగితపై దాడి చేయడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ సంఘటన జరిగిన వెంటనే, రాజును అపరాధభావం చుట్టుముట్టింది.

అతను తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం చేతిలో లైవ్ వైర్ పట్టుకుని విద్యుదాఘాతానికి పాల్పడ్డాడు. అతని అరచేతులపై కాలిన గాయాలయ్యాయి, కానీ అతను చనిపోలేదు. ఒకసారి విఫలం కావడంతో విషపూరితమైన పురుగుమందు తాగాడు. అయినప్పటికీ అతను చనిపోలేదు. బవానే ఇంటి నుండి గొడవ విన్న పొరుగువారు అతనిని రక్షించడానికి వచ్చారు. ఇరుగుపొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు రాజును గోండ్పిప్రి గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. అతనిపై భార్య హత్య కేసు నమోదైంది. రాజు పరిస్థితి నిలకడగా ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Next Story
Share it