టీ ఆలస్యమైంది.. పెళ్ళాన్ని ఏమి చేశాడంటే.?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్‌లో టీ చేసి పెట్టే విషయంలో గొడవపడి ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా చంపాడు.

By Medi Samrat  Published on  20 Dec 2023 9:19 PM IST
టీ ఆలస్యమైంది.. పెళ్ళాన్ని ఏమి చేశాడంటే.?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఘజియాబాద్‌లో టీ చేసి పెట్టే విషయంలో గొడవపడి ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా చంపాడు. ఈ కేసుకు సంబంధించి అతని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్టు చేశారు. మంగళవారం ఉదయం 8 గంటలకు ధర్మవీర్‌, అతని భార్య సుందరి (50) మధ్య టీ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. గొడవ పెరిగి పెద్దదవ్వడంతో ధర్మవీర్ ఇంట్లో ఉంచిన కత్తిలాంటి పదునైన ఆయుధంతో భార్య మెడపై మూడు నాలుగు సార్లు దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

ఈ దారుణం జరిగే సమయంలో మ‌రో రూమ్‌లో ఆయన న‌లుగురు పిల్ల‌లు నిద్రిస్తూ ఉన్నారు. ఆ స‌మ‌యంలోనే ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అర‌పులు విన‌బ‌డ‌డంతో స‌మీపంలో ఉన్న వారు ఇంటికి వ‌చ్చారు. అప్ప‌టికే సుందరి ర‌క్త‌పు మడుగులో ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్ట‌మ్ నిమిత్తం సుందరి మృతదేహాన్ని ఆసుపత్రికి పంపారు. దాడి జ‌రిపిన క్ష‌ణాల్లోనే ఆమె ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఏసీపీ ప్ర‌కాశ్ రాయ్ తెలిపారు. నిందితుడిపై కేసు న‌మోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

Next Story