భార్యను కిరాతకంగా హత్య చేసిన భ‌ర్త‌.. మొదట చేతులు నరికి.. ఆపై తల కూడా..

Man kills wife, chops hands and head, sets body on fire. హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

By M.S.R  Published on  28 April 2023 3:45 PM IST
భార్యను కిరాతకంగా హత్య చేసిన భ‌ర్త‌.. మొదట చేతులు నరికి.. ఆపై తల కూడా..

హర్యానాలోని మనేసర్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేసినందుకు అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వ్యక్తి మొదట భార్య చేతులు నరికి, ఆపై ఆమె తల కూడా నరికేశాడు. ఆ తర్వాత నిప్పంటించాడు. తన భార్యను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.

ఏప్రిల్ 21న మనేసర్‌లోని ఒక గ్రామంలో సగం కాలిపోయిన మహిళ మృతదేహం కనుగొనబడింది, ఆమెను వేరే చోట హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఎందుకంటే ఆమె చేతులు, తల అప్పటికే నరికేశారని గుర్తించారు. ఏప్రిల్ 23న పోలీసులు ఆ మహిళ చేతులను గుర్తించారు. హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె తల ఏప్రిల్ 26న కనుగొన్నారు. ఖేర్కీ దౌలా ప్రాంతానికి చెందిన ఒక మహిళ చనిపోయిందని పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో ఆ మొండెం 30 ఏళ్ల మహిళది అని నిర్ధారించారు. అయితే హత్య వెనుక కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె భర్తను విచారించగా అతడు నేరాన్ని ఒప్పుకున్నాడు. నిందితుడు జితేందర్‌ను విచారిస్తున్నామని మరిన్ని వివరాలు రాబడుతున్నామని గురుగ్రామ్ పోలీస్ కమిషనర్ కళా రామచంద్రన్ తెలిపారు. జితేందర్ గాంధీ నగర్ నివాసి, మనేసర్ ప్రాంతంలో అద్దెకు నివసిస్తున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.


Next Story