Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్య‌క్తి.. కారణం ఏమిటంటే..

మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి.. వీధికుక్కను స్తంభానికి కట్టేసి చంపేశాడు

By Medi Samrat  Published on  24 Aug 2024 3:33 PM IST
Telangana : వీధి కుక్కను దారుణంగా చంపిన వ్య‌క్తి.. కారణం ఏమిటంటే..

మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న వ్యక్తి.. వీధికుక్కను స్తంభానికి కట్టేసి చంపేశాడు. కుక్క మృతదేహాన్ని గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో పడేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు 30 ఏళ్ల వ్యక్తిని అరెస్టు చేశారు.

అరెస్టు చేసిన వ్యక్తిని రాజుగా గుర్తించారు. అతడొక కూలీ. గతంలో తనపైనా, తన కొడుకుపైనా ఆ కుక్క దాడి చేసిందని చెప్పుకొచ్చాడు. రాజు తన పనికి బైక్‌పై వెళుతున్నప్పుడల్లా కుక్క వెంటాడుతోందని తెలిపాడు. కుక్కను వదిలించుకోవడానికి.. రాజు దానిని పట్టుకుని స్తంభానికి కట్టాడు. తాడును ఉపయోగించి గొంతు బిగించి చంపేశాడు. అతను మృతదేహాన్ని అజీజ్‌నగర్ శివారులోని బహిరంగ ప్రదేశంలో పడవేసినప్పుడు.. కొంతమంది గ్రామస్థులు దానిని గమనించి తమ స్మార్ట్‌ఫోన్‌లలో బంధించారు. గ్రామస్థుడు క్రాంతి జంతు హక్కుల కార్యకర్తతో ఈ వీడియోను పంచుకున్నాడు. మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు రాజుపై బిఎన్‌ఎస్, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

బెయిలబుల్ నేరం కావడంతో పోలీస్ స్టేషన్‌లో రాజుకు బెయిల్ మంజూరు చేసి విడుదల చేసినట్లు మొయినాబాద్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్ కిషన్ సింగ్ తెలిపారు. వెటర్నరీ డాక్టర్ సహాయంతో పోస్ట్ మార్టం నిర్వహించి కుక్క మృతదేహాన్ని జంతు హక్కుల కార్యకర్తకు అప్పగించినట్లు సింగ్ తెలిపారు

Next Story