కరీంనగర్ జిల్లాలో ఆస్తి తగాదాల కారణంగా 32 ఏళ్ల వ్యక్తిని అతని తమ్ముడు, తండ్రి హత్య చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల మండలం మోహనరావుపేటలో ఆదివారం సాయంత్రం రాజేష్ (32)పై కోటే గంగారాం (55), చిన్న కుమారుడు రాకేష్ (30)లు సుత్తితో దాడి చేసి కత్తితో పొడిచారు. రాజేష్‌ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు సోమవారం మృతి చెందాడు.
"నిందితులకు, మరణించిన వ్యక్తికి మధ్య కుటుంబ ఆస్తి విభజనకు సంబంధించి కొన్ని వివాదాలు ఉన్నాయి" అని పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కోటే గంగారాం, రాకేష్‌ల కోసం గాలిస్తున్నారు.